సిద్దిపేట, జనవరి 8: కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో హైదరాబాద్లో జరుగుతున్న ‘అసాంక్రమిక వ్యాధుల’ జాతీయ సెమినార్కు హాజరైన బృందం ఫీల్డ్ విజిట్ చేసింది. సిద్దిపేట జిల్లాలో అసాంక్రమిక వ్యాధులకు అందుతున్న వైద్యసేవలను బృందం సభ్యులు పార్థసారధి సేన్ శర్మ ఉత్తరప్రదేశ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరాధనాపట్నాయక్, నేషనల్ హెల్త్ మిషన్ ఛత్తీస్గఢ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ దయరామ్, నేషనల్ హెల్త్ మిష న్ రాజస్థాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భారతి దీక్షిత్ ,
మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సీనియర్ ఈఏ ఇంద్రాణి కౌశల్, ఎన్హెచ్ ఎం నాగాలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అకౌసరహి, వివిధ రాష్ర్టాలకు చెందిన ఎన్సీడీ కార్యక్రమ అధికారులు బుధవారం సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ఎన్సీడీ సెంటర్ను, తెలంగాణ డయాగ్నోస్టిక్ హ బ్, డయాలసిస్ సెంటర్, ములుగు, మర్కూ క్, కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, మామిడ్యాల, నెమటూర్, ఎర్రవల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, బస్తీ దవాఖాన కాళ్లకుంట కాలనీ, పట్టణ ఆరోగ్య కేం ద్రం నాసర్పురాను సందర్శించారు.
అక్కడ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వారి సమస్య లు, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆరోగ్య శాఖ అధికారుల బృందంతో కలిసి కలెక్టర్ మనుచౌదరి జిల్లాలో అసాంక్రమిత వ్యా ధుల వైద్యసేవల కోసం ప్రభుత్వం కల్పించిన వైద్య సౌకర్యాలు, వైద్యసేవల గురించి బృందం సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ విమలాతామస్, సూపరింటెం డెంట్ శాంతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.