సిద్దిపేట టౌన్, జనవరి 8: జాతీయ యువజనోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి రంజిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
ఈనెల 11 నుంచి 12వతేదీ వరకు జాతీయ యువజనోత్సవాలు ఘనంగా జరుపుతామన్నారు. ఇందులో భాగంగా ‘మై భారత్-వికసిత్ భారత్ 2047’ అనే అంశంపై జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్ర మంలో అధ్యాపకులు పాల్గొన్నారు.