అప్రమత్తతే..శ్రీరామరక్ష
నిత్య జీవితంలో భాగమైన వంట గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలి. నేడు ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. నిరుపేదలకు దీపం పథకం ద్వారా ప్రభుత్వం సింగిల్ సిలిండర్‌ను అందిస్తున్నది.గ్యాస్‌ను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.
- వంటింట్లో సిలిండర్.. ఆదమరిస్తే ప్రమాదం
- గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలి
- సిలిండర్, గ్యాస్ పొయ్యి పనితీరు గమనించాలి
- జాగ్రతలు తప్పకుండా పాటించాలి
- సొంత ప్రయోగాలు వద్దు.. లేదంటే అంతే
సిద్దిపేట టౌన్ , మార్చి 4 : నిత్య జీవితంలో భాగమైన వంట గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలి. నేడు ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. నిరుపేదలకు దీపం పథకం ద్వారా ప్రభుత్వం సింగిల్ సిలిండర్‌ను అందిస్తున్నది.గ్యాస్‌ను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. వంటింట్లో సిలిండర్,గ్యాస్ పొయ్యి పనితీరును ప్రత్యేకంగా గమనించాలి. గ్యాస్ వాడకం ముగిసిన వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. వంటింట్లో ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా అది ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పేలిందని,లీక్ అయిందని , విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనలు మనం వింటుంటాం. దాదాపు అలాంటి సంఘటనలో సింహాభాగం మన నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంటాయి. వంటింట్లో అగ్నిప్రమాదాల నివారణకు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం , సూచనలు స్వీకరించడం, మెళకువలు పాటించడం మంచిది.
వంటింట్లో గ్యాస్ పొయ్యి సిలిండర్ కంటే ఎత్తులో ఉంచాలి. గ్యాస్ స్టవ్ మొదలు కొని రెగ్యులేటర్, గ్యాస్ సరఫరా పైప్, లైటర్ ఇలాంటి ముఖ్యమైన పరికరాలన్నీ ఐఎస్ఐ మార్కు కలిగి ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. సిలిండర్ అడ్డంగా కాకుండా నిలువుగా ఉంచాలి. వంటింట్లోకి గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. వంట చేసే సమయంలో కిచెన్ వెంటిలేటర్లు తప్పకుండా తెరిచిఉంచాలి. ప్రతి ఆరు నెలలకు ఒక సారి గ్యాస్ పొయ్యిని సర్వీసింగ్ చేయించాలి. గదిలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వంట చేయడం ప్రమాదకరం. గ్యాస్ సిలిండర్‌కు సేఫ్టీక్యాప్ ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. వంటగదిలో కిరోసిన్, పూజకు సంబంధించిన నూనెలు,బట్టలు, కాగితాలు ఉంచొద్దు. గోనెసంచులు, ఇసుక అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
జాగ్రత్తలు,సూచనలు
గ్యాస్ సిలిండర్ బరువు గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ 14.2 కిలోలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ బరువు 19కిలోలు ఉంటుంది. గ్యాస్ డెలివరీ బాయ్ తప్పకుండా గ్యాస్ సిలిండర్ వెయింగ్ మిషన్ తేవాల్సి ఉంటుంది. అదనపు చార్జీలు ఇవ్వొద్దు.
బీమా .. ధీమా
గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో సంబంధిత డీలర్ ప్రమాద బీమా బాండ్ పేపరును వినియోగదారులకు అందజేస్తారు. వ్యక్తితో పాటు ఇంట్లో విలువైన వస్తులవుకు బీమా వర్తింపజేస్తారు. ఏకారణంగానైనా ఇంట్లో ప్రమాదం జరిగితే వెంటనే విపత్తు నివారణ కార్యాలయం లేదా టోల్‌ఫ్రీ నంబర్ 101కు సమచారం ఇవ్వాలి. అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అందుపుచేస్తారు. అంతకుముందు ఇంట్లో వారు నివారణ చర్యలు చేపట్టాలి. ప్రమాదంలో ఎవరైనా గాయపడితే వెంటనే 108కు సమాచారం అందించి వారిని దవాఖానకు తరలించాలి. గ్యాస్ వినియోగదారులు విధిగా బీమా చేయించుకోవడంతో నష్ట నివారణ చర్యలను దాదాపు తగ్గించుకోవచ్చు. సొంత ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

