హుస్నాబాద్, జూన్ 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలోని ఈద్గాలో పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మార్నింగ్ వాక్‌లో ఉన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు ముస్లింలను స్వయంగా కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద ప్రార్థనల అనంతరం మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అలయ్‌బలయ్ తీసుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పటాన్చెరు, జూన్ 17: త్యాగానికి ప్రతీక బక్రీద్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురసరించుకొని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒకరూ బక్రీద్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సిద్దిపేట, జూన్ 17: త్యాగాల పండుగ బక్రీద్‌ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ఎక్బాల్ మినార్ వద్ద ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలయ్ బలయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్కు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, కరుణకు ప్రతీకగా బక్రీద్ నిలుస్తుందన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఉదయం ఈద్గా మైదానానికి భారీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గజ్వేల్, జూన్ 17: త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు గజ్వేల్‌లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మజీద్ కమిటీ అధ్యక్షుడు యూసుఫ్, కౌన్సిలర్ మెట్టయ్య, నాయకులు గుంటుక రాజు, గంగిశెట్టి రవీందర్, కనకయ్య, దుర్గాప్రసాద్, రియాజ్, స్వామిచారి పాల్గొన్నారు. కర్బూజపై గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు మజీద్, నమాజ్ చేస్తున్న ఇమామ్ చిత్రాన్ని రూపొందించాడు.