మెదక్ మున్సిపాలిటీ, జూన్ 20: మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కలిసి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏదులనాగులపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, సిద్దిపేట నుంచి పెద్దపల్లి వరకు రైల్వేలైన్ పొడింగించాలన్నారు.
పటాన్చెరు నుంచి అక్కన్నపేట, మెదక్ వరకు రైల్వే లైన్ పొడిగించాలని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. మెదక్, సిద్దిపేట నుంచి తిరుపతి వరకు రైల్ నడిపించాలని, వడియారం, అక్కన్నపేటలో రాయలసీమ, అజంతా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వడియారం, సిద్దిరేట రైల్వే స్టేషన్లలో రేక్ పాయింట్స్ నిర్మాణం జరపాలని కోరినట్లు పేర్కొన్నారు. దీనికి జీఎం సానుకులంగా స్పందించారని ఎంపీ తెలిపారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.