మర్కూక్, మార్చి 12: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని వరదరాజులస్వామి ఆలయ పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బీఆర్ఎస్ మర్కూక్ మండల నాయకులు అప్పాల ప్రవీణ్, లక్కాకుల నరేశ్, తుమ్మ ధనలక్ష్మీకృష్ణ, ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, కమిటీ సభ్యులు కవితను కలిసి విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్లో ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయగా, వాటిలో దాదాపు 65శాతం పనులు పూర్తి అయ్యాయని, అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి మిగతా పనులు బ్రహ్మోత్సవాల నాటికి పూర్తయ్యేలా కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీని కోరారు.