సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 30: నిజాం నిర్బంధాలను, రజాకార్ల దౌర్జన్యాలను ధిక్కరించిన త్యాగమూర్తి దాశరథి అని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆదివారం రాత్రి వర కు జరిగిన మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొని దాశరథి కవితా చైత న్యం అనే అంశంపై ఆయన మాట్లాడారు. కల్లోలాలపై, జాగీర్దారుల హింసపై తిరుగుబాటు చేసిన సాహసికుడు, భావికుడు, పం డితుడు, విప్లవకారుడు, సామ్యవాద పక్షపాతి దాశరథి అన్నారు. నిజామాబాద్ జైల్ లో చిత్రహింసల కొలిమిలో గాయాలు సలుపుతుంటే పద్యాలు చెప్పడం, గోడలపై పద్యాలను బొగ్గుతో రాయడం ఆయనకు మాత్ర మే చెల్లిందన్నారు.
వరంగల్‌లో సురవరం ప్రతాప్‌రెడ్డి నిర్వహించిన కవి సమ్మేళనం వేదికను రజాకార్లు దహనం చేసినప్పుడు బూడిద కుప్పలపై నిలుచుని నిజాం వ్యతిరేక కవిత్వాన్ని సంధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 32 పుస్తకాలు రాసి తెలంగాణ సాహిత్యంలో దాశరథి చెరగని ముద్ర వేశాడని కొనియాడారు. బిరుదురాజు రామరాజు పరిశోధనలు, సాహిత్య అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు జానపదాన్ని సాహిత్యంగా ముద్ర వేయడంలో రామరాజు చేసిన కృషి అద్భుతమన్నారు.
ఆరుద్ర స్ఫూర్తి అంశంపై సాహి త్య అకాడమీ మాజీ చైర్మన్ నందినీ సిధారెడ్డి మాట్లాడుతూ..మధ్యతరగతి బతుకుల ఆక్రో శం, తెలంగాణలో వెట్టి చాకిరి, మహిళలపై జరిగిన ఘోర ఆకృత్యాలు ఆరుద్ర సాహిత్యంలో ప్రతిఫలించాయన్నారు. తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ ఆయనకు ఉండేదన్నారు. వేడుకల్లో భాగంగా జరిగిన కవి సమ్మేళనం పలువురిని అలోచింపజేసింది. ఈ మేరకు పలువురు కవులు తమ గళాలను ప్రజా సమస్యలపై సంధించారు.