సిద్దిపేట, ఆగస్టు 10: ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటూ సేవ చే స్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రా వు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 217 మందికి 49.91 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెకులను ఆయన అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కాంగ్రెస్ హామీలు ఎగ్గొడుతూ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదన్నారు.
జీపీలకు నిధులు రావడం లేదన్నారు. గ్రామాల్లో చెత్త పేరుక పోతున్నదని, ట్రాక్టర్ డీజిల్‌కు, సఫాయి కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి జీపీల్లో డబ్బులు లేవన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్లో పనిచేసే కార్మికులకు సరిగ్గా వేతనాలు రావడం లేదన్నా రు. గ్రామాల్లో కుకలు దాడులు చేస్తున్నాయని, వసతి గృహల్లో ఎలుకలు కొరుకుతున్నాయని, మా ర్పు అంటే ఇదేనా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పారిశుధ్య నిర్వహణ లేక దోమలు,ఈగలతో డెంగీ, సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు అయినా లేదన్నారు.
తమకు ఏడు నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పుల్లూరులో పంచాయతీ సఫా యి కార్మికులు హరీశ్‌రావు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, నాయకులు పాల సాయిరాం, కాముని శ్రీనివాస్, గుండు భూపేశ్, కుంభాల ఎల్లారెడ్డి, మట్టె బాల్‌రెడ్డి, కీసర పాపయ్య, గ్యాదరి రవీందర్, మల్లికార్జున్, అరవింద్‌రెడ్డి, ఎర్ర యాదయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఒగ్గు బాలకృష్ణ, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.