ఆదర్శప్రాయుడు శ్రీరాముడు
శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, పరిపాలన దక్షకుడు...ధర్మ నిరతుడని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శ్రీరామ నవమిని పురసరించుకొని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
- శ్రీరాముడి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
- సిద్దిపేటలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, ఏప్రిల్ 17: శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, పరిపాలన దక్షకుడు…ధర్మ నిరతుడని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శ్రీరామ నవమిని పురసరించుకొని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముడు హకుల కంటే బాధ్యత గొప్పదని రామతత్వం ద్వారా నిరూపించారన్నారు. కష్టంలోనైనా కలిసి నడవాలని సీతా తత్వమన్నారు. కష్టాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగితేనే విజయ లభిస్తుందని శ్రీరాముడు నిరూపించారని ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. శ్రీరాముడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు.
నాలుగు గంటలు 25 ఆలయాలు…
సిద్దిపేట పట్టణంలోని సీతారామచంద్రస్వామి కల్యాణ ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు 24 ఆలయాల్లో జరిగిన కల్యాణ ఉత్సవాల్లో పాల్గొంటూనే..మరొకవైపు ప్రజలను ఆత్మీయ పలకరించారు. హౌసింగ్ బోర్డ్‌లోని పంచముఖ హనుమాన్ ఆలయం, రంగదాంపల్లి హనుమాన్ ఆలయం, హరిప్రియనగర్ అభయాంజనేయ స్వామి ఆలయం, శివాజీ నగర్‌లోని పంచముఖ హనుమాన్ ఆలయం, హనుమాన్ టెంపుల్,దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయం, గణేశ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం,
హనుమాన్ నగర్ ఆంజనేయస్వామి ఆలయం, షిరిడీ సాయిబాబా టెంపుల్, నాసరపుర హనుమాన్ ఆలయం, గంజి హనుమాన్ ఆల యం, పారుపల్లి వీధిలోని రామాలయం, రామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయం, కాలకుంట కాలనీ హనుమాన్ టెంపుల్, నగర్ హనుమాన్ టెంపుల్, గాంధీనగర్ హనుమాన్ టెంపుల్, నర్సాపూర్ హనుమాన్ ఆలయాల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు వంగా నాగిరెడ్డి, ఐలయ్య సంపత్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు ఉన్నారు.
వైభవంగా రాములోరి కల్యాణం
చిన్నకోడూరు, ఏప్రిల్ 17: మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. మాచాపూర్, మేడిపల్లి గ్రా మాల్లో బుధవారం నిర్వహించిన రాములోరి కల్యాణోత్సవంలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. కస్తూరిపల్లి, ఇబ్రహీంనగర్ పరిధిలోని రామన్నపల్లిలో నవగ్రహాల ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ పాపయ్య, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

