కొండపాక(కుకునూరుపల్లి),సెప్టెంబర్ 14: కొండపాక మండలంలోని దుద్దెడలో రుద్ర పవర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండ పం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు. గణపతి వద్ద పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమంలో భాగంగా భక్తులకు భోజనం వడ్డించారు. అనంతరం యువజన సంఘం సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ మిద్దె శంబయ్య, నాయకులు గుండెల్లి ఆంజనేయులు, చిక్కుడు భాను, రుద్ర పవర్ ఫ్రెండ్స్ యూత్ అసోషియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావుకు చిన్నారులు పువ్వులు అందించి రండి సార్…గణపతి దగ్గరికి అంటూ స్వాగతం పలికారు. దీంతో హరీశ్‌రావు చిన్నారులు ఇచ్చిన పువ్వును తీసుకొని థాంక్యూ అం టూ పలకరించి కరచాలనం చేసి చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.