చిలిపిచెడ్, అక్టోబర్ 9: అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీల అమలులో చేతులెత్తేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. బుధవారం చిలిపిచెడ్ రైతు వేదికలో తహసీల్దార్ ముసాద్దీక్ ఆధ్వర్యంలో 26 మంది లభ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ అందించడం లేదని విమర్శించారు.
ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచలేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడం లేదని, రైతులకు దసరా పం డుగ వరకు రైతు బంధు అందలేదని, మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అంటూ గొప్పగా ప్రచా రం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు.
కాం గ్రెస్ పాలనలో ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి,మాజీ ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు దుర్గారెడ్డి, సయ్య ద్ హుస్సేన్, కిషన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, షఫీయొద్దీన్, అనంతరామగౌడ్, వీరాస్వామి, శంకరయ్య, భీమయ్య, వీరాస్వామి, శంకర్‌నాయక్, భిక్షపతి నాయక్, రాకేశ్‌నాయక్, సత్యం తదితరులు పాల్గొన్నారు.