శివ్వంపేట, జులై 29 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వగృ హం నుంచి ఆమె కుమారులు వాకిటి శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు మహోత్స వం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలసి ఎమ్మెల్యే సునీతారెడ్డితో ప్రత్యేక పూజ లు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ..ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికత కలిగి ఉం డాలన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ..
అమ్మవారి చల్లని చూపుతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుం టలు నిండి పంటలు బాగా పండి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, సంతోష్‌రెడ్డి, వాకిటి హనుమంతరెడ్డి, మహిపాల్ రెడ్డి, రైతు సమన్వ య సమితి మండల అధ్యక్షుడు మొలుగు నాగేశ్వరరావు, మర్రి మహేందర్ రెడ్డి, గూ డూరు యాదగౌడ్, రాంచంద్రం గౌడ్, ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పంచమి రేణుకుమార్, పవన్ గుప్తా పాల్గొన్నారు.