వచ్చే ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మళ్లీ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి గురువారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని, భారీ విజయం సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ భూపాల్‌రెడ్డికి సూచనలు చేశారు.
– నారాయణఖేడ్, ఆగస్టు 24