ఝరాసంగం, ఆగస్టు 9: వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని బీసీ బాలుర వసతి గృహం ఆవరణలో అధికారులు, విద్యార్థులు, నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెం దిన లబ్ధిదారులకు రూ.11,09,500 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముం దు కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ రాజగోపురం ఎదుట ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సంగ మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకు లు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో సుధాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్, బీఆర్ఎస్ మండల నాయకులు సంగమేశ్వర్, బస్వరా జ్, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ లు, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.