వర్గల్, అక్టోబర్ 7: సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరిక్షేత్రంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సరస్వతీమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు యా యవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అమ్మవారి శేషవస్ర్తాలు, కంకణధారణ,తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు సరస్వతీమాత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మం గళవారం మహాలక్ష్మీ రూపంలో దర్శనమివ్వనున్న ట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.కార్యక్రమంలో మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, వర్గల్ ఫ్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.