సిద్దిపేట, డిసెంబర్ 6: విద్యార్థులు గురువుల మార్గదర్శనంలో నిరంతరం జ్ఞానాన్ని పెంచుకోవడం, అధ్యయనం చేయడం ద్వారా గొప్పస్థాయికి ఎదగవచ్చునని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రైవేట్ సూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్యతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానం అన్నారు. తల్లిదండ్రుల మాటలను, గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినడం ద్వారా మంచి స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు.
తెలంగాణ ప్రైవేట్ సూల్ అసోసియేషన్ పాఠశాలలు విద్యార్థులకు అన్నిరంగాల్లో ఆల్ రౌండర్లుగా మార్చేందుకు చదువుతోపాటు యోగా ఆలోచన శక్తిని పెంచే సైన్స్ ఫెయిర్లు, శారీరక శ్రమను విద్యార్థుల కల్పించేందుకు క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఏకాగ్రతతో చదివితే సాధించ లేనిది ఏదీలేదన్నారు. పుస్తకం జ్ఞానాన్ని అందిస్తుందని, నిరంతర పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పొందవచ్చన్నారు. ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం చేయాలని, పుస్తకం మంచి నేస్తమని హరీశ్‌రావు అన్నారు.
విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్ కేవలం అవసరానికి వినియోగించే వస్తువు మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రైవేట్ సూల్ అసోసియేషనుకు తన సంపూర్ణ సహకారాలు ఉంటాయని హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ప్రైవేట్ సూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, సంతోష్ కుమార్, ప్రతినిధులు రజనీకాంత్‌రెడ్డి హనుమం త్‌రెడ్డి, బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మ రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు