పటాన్చెరు, జూలై 12: మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి నూతనంగా రూ.1.50 కోట్లతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందన్నారు. చిన్న పంచాయతీలు, చిన్న మండలాలను ఏర్పాటు చేయడంతో అభివృద్ధి వేగవంతమందన్నారు. ముత్తంగి పంచాయతీ అధునికంగా ఉందని కితాబునిచ్చారు. మన సేవలతోనే ప్రజల మెప్పు పొందవచ్చన్నారు. ముత్తంగి గ్రామ నాయకుల వినతి మేరకు ఔటర్ రింగురోడ్డు నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు జాతీయ రహదారిపై లైట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇస్నాపూర్ నుంచి ముత్తంగి వరకు ఫార్మేషన్ రోడ్డును నిర్మిస్తామన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. పంచాయతీలో ఎలాంటి పనులున్నా తనను 24గంటలు సంప్రదించవచ్చని సూచించారు.
ఎమ్మెల్యేను మరోసారి గెలిపించాలి..
– స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని మూడో సారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి ప్రజలను కోరారు. మహిపాల్‌రెడ్డి ప్రజల్లో నిత్యం ఉంటూ చక్కటి సేవలను అందజేస్తున్నారని కొనియాడారు. తనకు ముత్తంగితో 1963నుంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గ్రామాభివృద్ధిలో తనవంతు అండగా నిలుస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుస్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, దేవానందం, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుప్రజావెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్,, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో హరిశంకర్‌గౌడ్, సర్పంచ్‌లు సుధీర్‌రెడ్డి, జగన్, మున్నూరు లక్ష్మయ్య, ఎంపీటీసీ మన్నే రాజు, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డయాదయ్య, పుణ్యవతి, మెరాజ్‌ఖాన్, అర్జున్, ఆబేద్, రామకృష్ణముదిరాజ్, గడీల శ్రీధర్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్‌లు కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్, రవి, శ్రీను, అమ్జద్ తదితరులు పాల్గొన్నారు.