సంగారెడ్డి,ఆగస్టు 16(నమస్తేతెలంగాణ)/సంగారెడ్డి: ఏకకాలంలో ఆగస్టు 15లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాటతప్పిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్, డీసీఎంఎస్చైర్మన్ శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా రూ.31వేల కోట్ల పంటరుణాలు మాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి కేవలం రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు.
ఎకకాలంలో రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి మాటతప్పారన్నారు. సంగారెడ్డి జిల్లాలోని రైతులకు వందశాతం రుణమాఫీ కాలేదన్నారు. మూ డో విడత రుణమాఫీకి సంబంధించి రైతుల జాబితాకానీ, రైతులకు మెసేజ్‌లు కానీ రాలేదన్నారు. రుణమాఫీ చేయకుండానే రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్, హరీశ్‌రావుల ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆగస్టు 15లోగా ఎలాంటి షరతులు లేకుండా పంట రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు సీఎంకు సవాల్ చేశారని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే హరీశ్‌రావు రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. పదవుల కోసం పాకులాడే బుద్ధి రేవంత్‌రెడ్డిది అన్నారు. పదవులను గడ్డిపోచల్లా విసిరేసే నేతలు కేసీఆర్, హరీశ్‌రావు అన్నా రు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పింది రేవంత్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు జోలికి వస్తే సహించేదిలేదని సీఎంను హెచ్చరించారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వందశాతం పంట రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ..ఖమ్మం జిల్లా లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నోరుపారేసున్నారని, సీఎం భాష మార్చుకోవాలని హితవు పలికారు. రుణమాఫీ చేయకుండా చేసినట్లు రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. సం గారెడ్డి జిల్లాలోని రైతులకు ఇంకా పూర్తిరుణమాఫీ కాలేదన్నారు. జహీరాబాద్ ప్రాంత రైతులు రుణమాఫీ కాలేదని తన వద్దకు వస్తున్నారని తెలిపారు. రుణమాఫీ చేసానని అబద్ధం చెబుతున్న సీఎం వెంటనే పదవికి రాజీనామా చేయాలని మాణిక్‌రావు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులకు వందశాతం పంటరుణమాఫీ చేయలేదని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, హరీశ్‌రావులపై నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రుణమాపీ అమలులో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. దీనిని తాను నిరూపిస్తానంటూ శివకుమార్ విలేకరుల సమావేశం నుంచే ఝరాసంగం డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి మూడో విడత పం ట రుణమాఫీ అయ్యిందా? మూడో విడత రుణమాపీ డబ్బులు పడ్డాయా? అని ప్రశ్నించారు. దీనికి మేనేజర్ సమాధానం ఇస్తూ.. సర్ ఇంకా మూడో విడత రుణమాఫీ జరిగినట్లు సమాచారం లేదని, డబ్బులు పడలేవని సమాధానం ఇచ్చారు. సమావేశంలో జైపాల్‌రెడ్డి, సంగారెడ్డి పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, విఠల్, జలంధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాలు చేసిన వీడియోను విలేకరుల సమావేశంలో మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రదర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతుల పంట రుణమాఫీ చేయడం, ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్‌రావు స్పష్టంగా సవాలు చేశారన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం వందశాతం రుణమాఫీ చేయకుండానే హరీశ్‌రావు రాజీనామా చేయమనడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రైతులను నమ్మించి గొంతు కోశారని ఆగ్రహ వ్యక్తం చేశారు. సీఎం కేవలం 46శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని, రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి హరీశ్‌రావు జోలికి వస్తే సహించేదిలేదన్నారు. హామీలు అమ లుచేయని రేవంత్‌రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ..సీఎం రేవంత్‌రెడ్డి హరీశ్‌రావు జోలికి వస్తే సహించమన్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతులకు వందశాతం రుణమాఫీ కాలేదన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలోని ఏదైనా గ్రామానికి వెళ్లి వందశాతం రుణమాఫీ జరిగిందని రైతులతో చెప్పించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాలేదని రైతులు చెబితే వెంటనే జగ్గారెడ్డి తన రాజకీయ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.