సంగారెడ్డి, మార్చి16 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం సిగ్గుచేటని సంగా రెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్ అన్నారు. శనివారం పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని కవిత ను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగానే ఎమ్మెల్సీని కావాలనే ఈడీ అక్రమ అరె స్ట్ చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు నమ్మకం కగిలించాలన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, నాయకులు నరహరిరెడ్డి, కా సాల బుచ్చిరెడ్డి, రాంరెడ్డి, ఆర్. వెంకటేశ్వర్లు, నర్సింహులు, బీరయ్య యాదవ్, డాక్టర్ శ్రీహరి, సుదర్శన్‌రెడ్డి, మాణిక్‌ప్రభు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
అందోల్, మార్చి 16: బీజేపీ అక్రమ అరెస్టులకు, కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం జోగిపేట హన్మాన్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కవిత అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాజకీ య కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ బాల య్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఎంపీటీసీ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్చెరు, మార్చి 16: కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పటాన్చెరు పట్టణంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును వారు తీవ్రం గా ఖండించారు. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ డౌన్‌డౌన్ నినాదాలు చేశారు. పటాన్చెరు పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా బీఆర్ఎస్ నేతలను పోలీస్‌స్టేషన్ తరలించారు. సొంత పూచీ కత్తుపై వారిని వదిలేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్బాల్రెడ్డిలు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను అణచివేయాలనే ఆలోచనలతోనే జాతీయ పార్టీలు అక్రమ కేసులు పెడుతున్నాయన్నారు.
మోదీ ప్రభుత్వం ఎమ్మె ల్సీ కవితపై అక్రమ కేసును పెట్టి ఈడీ ద్వారా అరెస్టులు చేయించడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్‌గౌడ్, కార్పొరేటర్ పుష్పానగేశ్, అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మ న్ నర్సింహగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, అంజయ్యయాదవ్, పరమేశ్‌యాదవ్, షేక్‌హుస్సేన్, నాయికోటి రాజేశ్, పాండు, మహ్మద్ అఫ్జల్, శకీల్, బూన్ పాల్గొన్నారు.
కోహీర్, మార్చి16: ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని 165వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ అందరి మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ తీరుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మాట్లాడు తూ బీజేపీకి ఓటమి భయం, రాజకీయ కుట్ర లో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమాభివృద్ధి సంస్థల కార్పొరేషన్ మాజీ చైర్మన్ తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడూ ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నర్సింహులు, శంకర్‌నాయక్, సుభాశ్‌రెడ్డి, బండిమోహన్, రవికిరణ్ ఉన్నారు.
నారాయణఖేడ్, మార్చి 16: కవిత అరెస్టు కు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌లో ర్యాలీ నిర్వహించి అనంతరం రాజీవ్‌చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విచారణ సం స్థలను ప్రతిపక్ష నాయకులపై ఉసిగొల్పుతున్నదన్నారు. ఎమ్మెల్సీ కవితపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షే మం కోసం కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే బీజేపీ ప్రయత్నాలను వచ్చే ఎంపీ ఎన్నికల్లో ప్రజలే తిప్పికొడతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.