చేర్యాల/కొమురవెల్లి, సెప్టెంబర్ 28: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరుకు గోదావరి జలాలను శనివారం విడుదల చేయడంపై చేర్యాల ప్రాంత రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. చేర్యాల ప్రాం తంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలు అం దించి కరువును శాశ్వతంగా తరిమికొట్ట్టేందుకు కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి -ఐనాపూర్ గ్రామా ల మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్ నిర్మించారు.
కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రిజర్వాయర్ల నుంచి నీటిని కాల్వల ద్వారా చెరువులు నింపే కార్యక్రమానికి రాష్ట్రంలోనే ప్రథమంగా ఇక్కడ ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతంలో చెరువులు మత్తడి దూకి పంటల సాగు పెరిగింది. బీఆర్ఎస్ హ యాంలో ఏటా చెరువుల్లోకి గోదావరి జలాలు పంపింగ్ చేశా రు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రిజర్వాయర్‌ను పూర్తి స్థ్ధాయిలో నింపలేదు.ఇటీవల జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేయడంతో తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటి విడుదల ప్రారంభించారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరకముందే శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, బొందుగుల, కొలునుపాక, రాజపేట తదితర గ్రామాల్లో చెరువులు నింపేందుకు తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు.
అక్కడి నుం చి మెయిన్ కాల్వ వద్ద గేట్వాల్ విప్పి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామ చెరువును పూర్తిస్థాయిలో నింపి అక్కడి నుంచి రాజపేటకు నీటిని తరలించే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు.రిజర్వాయర్ నుంచి చేర్యాల, మద్దూ రు ఉమ్మడి మండలాల చెరువులు పూర్తిస్థాయిలో నింపిన అనంతరం నీటి నిల్వలు ఉంటే ఆలేరు నియోజకవర్గానికి తీసుకుపోతే ఇక్కడ రైతులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, ఎలాంటి అనుమతులు లేకుం డా తన అధికారాన్ని వినియోగించి ఇక్కడ చెరువుల నింపకముందే తన ప్రాం తానికి నీటిని తీసుకుపోతుండడంపై ఈ ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తపాస్‌పల్లి నీటిని కొండపాక, నంగునూరు తదితర మండలాలకు ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకుపోయారని గొంతుచింపుకున్న నాటి ప్రతిపక్ష, నేటి అధికార పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని ఈ ప్రాం త రైతాంగం ప్రశ్నిస్తున్నది. ఈ విషయమై సంబంధిత శాఖ డీఈ అంజయ్యను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో వివరణ కోరగా.. చేర్యాల, కొమురవెల్లి మండలంలోని చెరువులు నింపామని, చేర్యాల పెద్ద చెరువు త్వరలో నింపుతామన్నారు. టెయిల్ ఎండ్‌లో ఉన్న కొన్నె చెరువు మత్తడి దూకితేనే బొందుగులు, అక్కడి నుంచి రాజపేటకు గోదావరి జలాలు వెళ్తాయన్నారు.