అమీన్పూర్, అక్టోబర్ 29: ఆయుష్మాన్ భారత్ పీఎం జెన్ ఆరోగ్యయోజన కార్యక్రమంలో భాగం గా ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయం తి సందర్భంగా మంగళవారం సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ సంస్థలో ఇంటర్నెట్ వేదికగా వర్చువల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ వర్చువల్ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, టీజీఐసీసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, టీజీఐఐ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ఎండీ ఎస్‌హెచ్.ధీరజ్‌లాల్ కోటాడియా, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.