కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి
అమ్మా కంటి పరీక్షలు చేయించుకున్నరా.. పరీక్షలు మంచిగా చేస్తు న్నారా అని మంత్రి హరీశ్‌రావు మహిళలను అడిగి తెలుసుకున్నా రు.
సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 15 : అమ్మా కంటి పరీక్షలు చేయించుకున్నరా.. పరీక్షలు మంచిగా చేస్తు న్నారా అని మంత్రి హరీశ్‌రావు మహిళలను అడిగి తెలుసుకున్నా రు. అవసరమైన వారికి సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ దవాఖానలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. బుధవారం పట్టణంలోని బారాహిమామ్ చౌరస్తా ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలతో మంత్రి మా ట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అవసరమైన వారికి రీడింగ్ గ్లాస్లు, దూరం చూపు సమస్య ఉన్న వారికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఇంటింటికీ తిరిగి అందజేయాలని సూచించారు. అంతకుముందు పట్టణంలోని 17వ వార్డు నెహ్రూ పార్కు సమీపంలో కార్మిక సంఘ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్ బందారం శ్రీలత రాజు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

