ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి
సిద్దిపేట క్రీడా మైదానంలో పునరుద్ధరించిన సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
- మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
- అతివలు అన్ని రంగాల్లో రాణించాలి
- మహిళల భద్రత కోసమే షీటీమ్స్
- ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- సిద్దిపేటలో 5 కేరన్ ప్రారంభం
- పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, యువతులు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో 5కే రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రత కోసం ప్రభుత్వం షీటీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పదన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తెలంగాణలో బాలికల విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు.
సిద్దిపేట, మార్చి 8: ‘నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలి… దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నట్లు మహిళలు కూడాముందువరుసలో ఉండాలి’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. బుధవారం ఆంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో షీ టీమ్స్ , సీపీ శ్వేత ఆధ్వర్యం లో నిర్వహించిన 5కే రన్‌ను జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, జిల్లా జడ్జి రఘురామ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 5కేరన్‌కు వచ్చిన మహిళల ఉత్సా హం చూస్తే సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహిళాభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా కృషిచేద్దామన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చన్నారు. ప్రతి సంవత్సరం 5కేరన్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపా రు. ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగా, రన్నింగ్ ఒక భాగం కావాలన్నారు. ఫిజికల్ పిటినెస్పై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బాలికల విద్య కోసం రెసిడిన్షియల్ పాఠశాలలు స్థాపించామన్నారు. అన్ని రం గాల్లో మహిళలు మొదటి స్థానంలో నిలుస్తున్నట్లు తెలిపారు. అనంతరం 5కేరన్ విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళల విభాగంలో కావ్య ప్రథమ, హారిక ద్వితీయ, ఇందు తృతీయ స్థానం లో, పురుషుల విభాగంలో అఖిల్ ప్రథమ, అభిషేక్ ద్వితీయ, ఎల్లం తృతీయ స్థానంలో నిలిచారు.
సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభం
సిద్దిపేట క్రీడా మైదానంలో పునరుద్ధరించిన సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సీపీ శ్వేత, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్‌తో కలిసి మంత్రి షటిల్ఆడాడు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

