అందోల్, ఫిబ్రవరి 17 : జోగిపేట అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం జోగిపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పట్టణాభివృద్ధిపై వ్యాపారులు, కులసంఘాలతో మంత్రి సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అంతకుముందు మహిళా పాలిటెక్నిక్ కళాశాలను తనిఖీచేసి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఐబీ అతిథి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మాణంపై అధికారులతో చర్చించారు.
చెరువుకట్ట సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడు తూ జోగిపేట ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డీటీ మధుకర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, శివశంకర్, సత్యనారాయణ, రంగ సురేశ్, నాగరాజు, దుర్గేశ్, చందర్‌నాయక్, రేఖాప్రవీణ్, హరికృష్మగౌడ్, కోఆప్షన్ సభ్యుడు శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, మాజీ సర్పంచులు కృష్ణారెడ్డి, ప్రదీప్‌గౌడ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు విశ్వనాథం, చంద్రశేఖర్, రాజు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 17: సమాజాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు తోడ్పాటునందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి సీఎస్ఆర్ నిధుల సేకరణపై అధికారులు, పరిశ్రమ ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించేలా చూడాలన్నారు.
సీఎస్ఆర్ నిధులను విద్య, వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నా రు. జిల్లాలోని ఆయా పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ కింద ఇవ్వాల్సిన నిధులు, ఇప్పటివరకు ఇచ్చినవి, ఇంకా ఇవ్వాల్సిన బకాయిలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధు రి, పరిశ్రమల శాఖ జీఎం, అనుబంధ శాఖల అధికారులు, వివిధ పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు.
మునిపల్లి, ఫ్రిబవరి 17: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని, సీఎంఆర్ఎఫ్ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మునిపల్లి గ్రామానికి చెందిన సందీప్‌కు శనివారం సంగారెడ్డిలో మంత్రి రూ. 75 వేల ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో రాజుపటేల్, నరేందర్ గౌడ్, పరమేశ్వర్, వీరుయాదవ్ తదితరులు ఉన్నారు.