సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 15: సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల్లో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్తో కలిసి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను మంత్రి దామోదర సన్మానించారు.
జిల్లాలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు.