సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులపై జిల్లాలోని భారీ, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో సామాజిక, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి సీఎస్ఆర్ కేటాయింపులపై చర్చించారు. జిల్లాలోని కంపెనీలు అభివృద్ధికి 2శాతం సీఎస్ఆర్ నిధులను విడుదల చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పాల్గొన్నారు.