అందోల్, డిసెంబర్ 17: అందోల్ నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలో కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేయగా అందోల్-జోగిపేట ఆర్డీవో పాండు, పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు మంత్రిని సన్మానించారు.
మున్సిపల్ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, శివశంకర్, సత్యనారాయణ, హరికృష్ణగౌడ్, రంగసురేశ్, రేఖాప్రవీణ్, నాగరాజు, దుర్గేశ్, చందర్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, నాయకులు సారశివకుమార్, ప్రవీణ్, సంగమేశ్వర్, శ్రీశైలం, సందీప్‌గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.