నర్సాపూర్ : నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామం ఆంజనేయస్వామి స్వామి ఆలయానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆముద (వంజరి) శ్రీనివాస్ ( Amuda Srinivas ) మైక్‌సెట్ ( Mikeset ) ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు ఆముద సత్యనారాయణ జ్ఞాపకార్థం మైక్‌సెట్‌ను విరాళంగా అందశానని వెల్లడించారు.
ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆముద శ్రీనివాసును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సుధీర్ కుమార్ గౌడ్, సభ్యులు మంగలి శ్రీనివాస్, కమ్మరి నర్సింలు, ఊట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.