రామంతాపూర్లో లబ్ధిదారులతో సమావేశం
అభివృద్ధి రంగాలను ఎంపిక చేసుకోవాలి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి
వెల్దుర్తి, ఫిబ్రవరి 26 : దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. దళిత బం ధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధ్దిదారులు ఆర్థికాభివృద్ధి చెందాలని అధికారులు సూచించారు. లబ్ధిదారులు అభివృద్ధికి అవకా శం ఉన్న రంగాలను ఎంపిక చేసుకోవాలన్నా రు. శనివారం మాసాయిపేట మండలంలోని రామంతాపూర్లో సర్పంచ్ ప్రణీత ఆధ్వర్యం లో దళితబంధు లబ్ధిదారులకు అవగాహన స మావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రామకృష్ణ దళితబంధు పథకం లక్ష్యాలపై అవగాహన కల్పించారు. ఎక్కువ మంది వాహనాలపై మొగ్గు చూపుతున్నారని, దీంతో అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువన్నా రు. వ్యాపారాలు, దుకాణాల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. లబ్ధ్దిదారులు స్థిర ఆదా యం వచ్చేవాటిని ఎన్నుకోవాలని తెలిపారు. సమావేశంలో వెటర్నరీ డాక్టర్ రేఖ, ఏఈవో ర జిత, కార్యదర్శులు ప్రణీత్, వినోద్ ఉన్నారు.