మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట, ఏప్రిల్ 27 : ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్‌రెడ్డి తెలిపారు. మెదక్ మండలం మంబోజిపల్లి, ర్యాలామడుగు గ్రామాల్లో మెదక్ పీఏసీఎస్ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, మద్దతుధర పొందా లని సూచించారు. క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, సాధారణ రకానికి రూ. 2040 మద్దతుధరను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిం చి, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గంజి ప్రభాకర్, రజినీభిక్షపతి, ఎంపీటీసీ మానస, సెంటర్ ఇన్చార్జి మహేశ్ పాల్గొన్నారు
ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నదని మెదక్ వ్యవసాయ డివిజన్ అధికారి విజయనిర్మల, పీఏసీఎస్ చైర్మ న్ సీతారామయ్య తెలిపారు. మెదక్ మండలం చిట్యాల గ్రా మంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాచవరం పీఏసీఎస్ చైర్మన్ సీతారామయ్య, ఏడీఏ విజయనిర్మల, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ వెంకటేశం ప్రారభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ప్రయోజ నం కలిగించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు వడ్లు ఎండబోసి, తాలు లేకుండా, 17 శాతం తేమ మించకుండా ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వర్షాలతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాములు, ఉపసర్పంచ్ యాదాగౌడ్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లి, టి.మాందాపూర్ గ్రామాల్లో మడూర్ పీఏసీఎస్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లోరి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మీనా, భిక్షపతిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ ప్రసాద్‌గౌడ్, డైరెక్టర్ సిద్ధ్దాగౌడ్, నాయకులు రవీందర్, రమేశ్ ఉన్నారు.
కొల్చారం, ఏప్రిల్ 27 : మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్గుప్తా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్చారం మండలంలోని కొంగోడు, అంసాన్పల్లి, కొల్చారం, పోతంశెట్‌పల్లి, చిన్నాఘన్‌పూర్, వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, ఎనగండ్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరుకావాలని కోరారు.