కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు
“తొమ్మిదేండ్లలో పోని కరెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకుపోతున్నది.. కేసీఆరే కావాలి, కరెంట్ రావాలి” అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు.
- కేసీఆర్ కావాలి.. కరెంట్ రావాలి
- ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతా..
- నంగునూరు మండల కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
నంగునూరు, ఏప్రిల్ 7: “తొమ్మిదేండ్లలో పోని కరెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకుపోతున్నది.. కేసీఆరే కావాలి, కరెంట్ రావాలి” అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం నంగునూరు మండల కేంద్రంలోని శ్రేష్ట ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డే తనకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని కోరారు. ఈ జిల్లాకు కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా పనిచేశానన్నారు. పార్లమెంట్లో ఒక మాజీ కలెక్టర్‌గా, మెదక్ ఎంపీగా అడుగుపెట్టే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. కలెక్టర్‌గా పనిచేసే సమయంలో తన దగ్గరికి వచ్చే వాళ్లను తన తోబుట్టువులుగా చూశానని, ఎంతో బాధ్యతాయుతంగా పనిచేశానన్నారు.
ట్రస్ట్ ద్వారా యువతకు అండగా నిలుస్తా..
తనకు డబ్బు మీద యావలేదని.. పేదలకు సేవ చేయడం మీదనే దృష్టి ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. తాను చేసే సేవ నా తర్వాత కూడా 50 ఏండ్లు పేరు నిలిచి ఉండాలన్నదే తన ధ్యేయం అన్నారు. తన ఉమ్మడి కుటుంబ సభ్యుల సహకారంతో రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అండగా ఉంటానన్నారు. యువతకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి జాబ్ మేళా వేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
నంగునూరు మండలంలో తనకు భారీ మెజార్టీ వస్తుందని, ఎంపీగా తాను గెలవడం ఖాయమన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన గులాబీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నంగునూరు బీఆర్ఎస్ ఇలాఖా అని, సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూరు మండలంలో ఎప్పుడూ భారీ మెజార్టీ అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమ, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్‌గౌడ్, నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి, రాజిరెడ్డి, వేణుగోపాల్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

