నిజాంపేట, ఫిబ్రవరి18: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామ ఉన్నత పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 58 ఉండగా బోధన సిబ్బంది సంతృప్తి కరంగానే ఉంది. కానీ వసతులు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి.
పాఠశాల చుట్టూ ప్రహరీ లేక పరేషన్ అవుతుంది.పాఠశాల పక్కనే పంట పొలాల నుంచి విషసర్పాలు పాఠశాలలోకి రావడంతో విద్యార్థులు క్షణం క్షణం భయపడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రహారీ లేకపోగా.. పాఠశాల గ్రౌండ్‌ను అనుకొని వ్యవసాయ పొలం వద్ద పంట రక్షణలో భాగంగా రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ విద్యార్థుల పాలిట యమపాశంగా మారింది. ప్రతి రోజు విద్యార్థులకు అందించే మధ్యాహ్నా భోజనాన్ని వండుతున్న నిర్వాహకులకు అసంపూర్ణంగా ఉన్న కిచెన్ షెడ్ నిర్మాణం సవాలుగా మారింది. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక ఆరుబయటే విద్యార్థులు పాఠ్యాంశాలను వింటున్నారు.
Rampur4
ప్రహారీ నిర్మాణం కోసం, అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని విద్యాశాఖ ఉన్నత అధికారులకు నివేదిక రూపంలో అందజేసిన ఎటువంటి స్పందన లేదని పాఠశాల హెచ్.ఎం పద్మారెడ్డి తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రాంపూర్ పాఠశాలకు నిధులను మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిడండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.