మెదక్ జిల్లావ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం వివిధ ప్రాంతా ల్లో గణనాథులను ఊరేగించి, నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వినాయక మండపాల్లో లడ్డూలకు వేలంపాట నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని 10వ వార్డులోని నర్స్‌ఖేడ్ వీరహనుమన్ గణనాథుడిని ఆటోనగర్ వరకు శోభాయాత్ర నిర్వహించి, అక్కడి నుంచి కొంటూర్ చెరువుకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
కొల్చారం మండలకేంద్రంలో వినాయక శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. తుక్కాపూర్‌లో శివగణేశ్ మండలి ప్రతిష్ఠించిన గణేశ్ లడ్డూను రూ.43వేలకు గ్రామానికి చెందిన ఆరే పశుపతిరావు కైవసం చేసుకున్నారు. అప్పాజి పల్లిలో జైదుర్గా భవాని గణేశ్ మండలి లడ్డూను రూ.16వేల కు గోపాల్ కైవసం చేసుకున్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
చిలిపిచెడ్ మండలకేంద్రంతో పాటు చండూర్, చిట్కుల్, శీలంపల్లి, సోమక్కపేట గ్రామాల్లో గణేశ్ శోభాయాత్ర వైభవంగా సాగింది. చండూర్లో రెడ్డి సం ఘం వినాయక లడ్డూను రూ.50వేలకు చెన్నముల్లా మల్లారెడ్డి కైవసం చేస్తుకున్నారు. హవేళీఘనపూర్ మండలం కూచన్‌పల్లిలో నేతాజీ గణేశ్ మండలి వినాయకు డికి ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పూజలు చేశారు. పెద్దశంకరంపేటలో గంగపుత్ర యూత్ అసోసియేషన్ గణేశ్‌కు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పూజలు చేశారు. – మెదక్ నెట్వర్క్, సెప్టెంబర్ 9