రామాయంపేట, సెప్టెంబర్ 6 : పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్క రూ సహకరించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని శారద సమవేశ హాల్లో మున్సిపల్ అధ్వర్యంలో పట్టణ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు తమ సమస్యలను వివరించారు. మెదక్ చౌరస్తా నుంచి మసీదు ముందుగా సుభాష్ విగ్రహం వరకు చేపట్టనున్న రోడ్డు విస్త రణ పనులపై వ్యాపారులతో మాట్లాడి సలహాలు తీసుకున్నా రు. మరోసారి వ్యాపారులు, ప్రజలతో సమావేశాలు నిర్వ హించి, రోడ్డు పనులను ప్రారంభిస్తామని ఇఫ్కో డైరెక్టర్, ము న్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. రామాయంపేట పట్టణాభివృద్ధికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేదేందర్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు. పట్టణంలోని రోడ్ల మరమ్మతులకు నిధులు మం జూరు చేశారని వివరించారు. సమావేశంలో కౌన్సిలర్లు దేమె యాదగిరి, నాగరాజు, సుందర్‌సింగ్, గంగా ధర్, టీఆర్ఎస్ నాయకులు కొండల్‌రెడ్డి, బాలుగౌడ్, దేవుని రాజు, చింతల యాదగిరి, మల్లాల కిషన్ పాల్గొన్నారు.
మెదక్ మార్కెట్‌ను సందర్శించిన ఇఫ్కో డైరెక్టర్
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 6 : జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ను ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సందర్శించారు. శిథిలావస్థకు చేరిన దుకాణాలు కూల్చివేయాలని చైర్మన్‌కు సూచించారు. మార్కెట్లో పార్కింగ్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సమస్యలను వ్యాపారులు వివరించారు.
గణనాథుడిని దర్శించుకున్న ఇఫ్కో డైరెక్టర్, నేతలు
మెదక్ జిల్లా కేంద్రంలోని 6వ వార్డులోని గణనాథుడిని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానంలో పాల్గొన్నారు. ఆయన వెంట ము న్సిపల్ కమిషనర్ శ్రీహరి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతల నర్సింహులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్ణణాధ్యక్షుడు గంగాధర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బోద్దుల కృష్ణ, ముజీబ్, నిర్వాహకులు సంగమేశ్వర్, రాగం శ్రీనివాస్, రమేశ్, బోస్, మధుసూదన్ తదితరులు ఉన్నారు.