నర్సాపూర్, సెప్టెంబర్ 6 : మండలంలోని నాగులపల్లి గ్రామ శివారులో నర్సాపూర్ డివిజన్ సర్వేయర్ శేఖర్వర్మ ఆధ్వర్యంలో మంగళవారం రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. నర్సాపూర్ మండల సర్వేయర్ లాల్యానాయక్, చిలిపిచెడ్ సర్వేయర్ రవిప్రసాద్తోపాటు సర్పంచ్ సేనాధిపతి, పలువురు రైతులు సర్వేలో పాల్గొన్నారు. నాగులపల్లిలో సుమారు 10 ఎకరాల భూమి ఆర్ఆర్ఆర్కు వెళ్తున్నట్లు, ఈ మేరకు సర్వే చేసి హద్దులు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నర్సాపూర్ మండలంలోని నాగులపల్లి, మూసాపేట్, జయరాంతండా, ఎల్లారెడ్డిగూడ మీదుగా మహ్మదాబాద్, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, తుజాల్పూర్ శివారు నుంచి భూముల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నష్ట పరిహారం ఎక్కువ చెల్లించాలి : రైతులు
మండలం నుంచి సుమారు వంద ఎకరాల పంట భూము లు ఆర్ఆర్ఆర్కు వెళ్తున్నందున నష్టపరిహారం ఎక్కువగా చెల్లించాలని రైతులు కోరారు. నాగులపల్లి, దౌల్తాబాద్, మూసాపేట్ శివారులో నుంచి నాగులపల్లి గ్రామాల్లో భూములను కోల్పోస్తున్నట్లు తెలిపారు. నాగులపల్లి సర్పంచ్ సేనాధిపతి మాట్లాడుతూ.. కాళేశ్వరం కోసం సుమారు 190 ఎకరాల పంట భూ ములను గ్రామస్తులు కోల్పోగా, ఇప్పడు ఆర్ఆర్ఆర్కు భూము లు కోల్పోతున్నట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం అధికంగా చెల్లించాలని కోరారు.