హుస్నాబాద్, ఆగస్టు 25: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో జరిగిన గిరిజనుల తీజ్ ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాట్లు చేయడంతో పాటు ఆయా తండాలకు రోడ్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. తీజ్ ఉత్సవాలు గిరిజన జీవనశైలికి అద్దం పడుతాయని, తీజ్లాంటి వేడుకలు గిరిజన యువతులు ఎంతో సంబురంగా జరుపుకొంటారని చెప్పా రు. హుస్నాబాద్ పట్టణంలోని గిరిజనులు ఒక్కచోట చేరి తీజ్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఉత్సాహంగా తీజ్ వేడుకలు : హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో జరిగిన గిరిజనుల తీజ్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేకు సంప్రదాయ కండువాకప్పి, రుమాలు చుట్టి గిరిజన నాయకులు ఘనస్వాగతం పలికారు. అత్యం త పవిత్రంగా భావించే తీజ్‌లను ఎమ్మెల్యేకు అందజేశారు. తీజ్‌లను ఎత్తుకొని గిరిజన యువతులు, మహిళలు నృత్యాలతో అలరించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ మానస, జడ్పీటీసీ భూక్య మంగ తదితరులు గిరిజన మహిళలతో కలిసి నృత్యా లు చేశారు. మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, వార్డు కౌన్సిలర్లు, గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం తీజ్‌లను ఆటపాటలు, నృత్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేశారు.
బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతికగా నిలిచే తీజ్ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ధూళిమిట్ట మండలంలోని బెక్కల్ గ్రామ శివారు, నంగునూరు మండల పరిధిలోని జేపీ తండాలో గురువారం తీజ్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ లెజెండ్ యూత్ అధ్యక్షుడు లకావత్ దేవేందర్‌నాయక్ తండానాయక్ లకావత్ హరిలాల్‌నాయక్, వార్డు సభ్యులు, నంగునూరు మండల పరిధిలోని జేపీ తండాలో జడ్పీటీసీ ఉమా వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.
-మద్దూరు(ధూళిమిట్ట)/ నంగునూరు, ఆగస్టు25