నర్సాపూర్, ఆగస్టు 21 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనే ఆలయాలు అభివృద్ధ్ది చెందాయని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో మెదక్ బిషప్ సోలేమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దైవచింతన కలిగిన వ్యక్తి అని, అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ, వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని వెల్లడించారు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ప్రజలందరూ ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, టీఆర్ఎస్వీ నాయకుడు సుధీర్, రెవరెండ్ ప్రభాకర్, క్రిస్టియన్స్ సాగర్, అరుణ్, వినోద్, ప్రేమ్, వినయ్, నవీన్, ప్రభాకర్, ప్రసాద్, ఏసుపాదం, ఏసురత్నం, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్‌రెడ్డి, అశోక్‌గౌడ్, నగేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.