చేగుంట, ఆగస్టు 19: చేగుంట పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. మండల పరిధిలోని వడియారంలో శుక్రవారం పెద్ద దేవాలయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. చర్చి ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చేగుంటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో షెడ్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసి, భూమి పూజ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఇటీవల గోడకూలి మృతి చెందిన రెండు బీహారీ కూలీల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షల చెక్కులను అందజేశారు. అదేవిధంగా 30 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ చేగుంట పట్టణం, మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. చేగుంట స్టేషన్ రోడ్డులో సీసీ రోడ్డు, నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, వడియారంలో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపేందుకు కృషి చేస్తానన్నారు.
అనంతరం నార్సింగి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాడెం వెం గళ్రావు, పట్టణాధ్యక్షుడు ఎర్ర యాదగిరి, కెమిస్ట్రీఅండ్ డ్రగ్గిస్ట్ రాష్ట్ర కార్యదర్శి రాజు, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు నాగరాజు, హనుమయ్య, నాగభూషణం, బాలేశం, రాజేశ్వర్, మార్కెట్ కమిటీ, సొసైటీ డైరెక్టర్లు రఘురాములు, లక్ష్మణ్, సత్యనారాయణ, సర్పంచులు మోహన్, భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, రాములు, ఎంపీటీసీలు హోళియనాయక్, నవీన్, మండల నాయకులు నర్సింహులు, బక్కి రమేశ్, తానీషా, విశ్వేశ్వర్, భాగ్యరాజ్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.