నర్సాపూర్/ మెదక్ మున్సిపాలిటీ/ చేగుంట/ పెద్దశంకరంపేట/ రామాయంపేట, ఆగస్ట్టు 14 : 75వ భారత స్వాతం త్య్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం లో భాగంగా ఆదివారం నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరై మాట్లాడారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వా తంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్న సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విజయవం తం చేసి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, కమిషనర్ చాముండేశ్వరి, విద్యార్థులు ఉన్నారు.
అమరులను స్మరించుకోవాలి : మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
అమరవీరులను స్మరిస్తూ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో తెలంగాణ సాంస్కృతిక, జానపద కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్ని వర్గాలు, అన్ని మతాలకు కేంద్ర బిందువనిపేర్కొన్నారు. కళాకారులతోపాటు టీఆర్ఎస్ నాయకులు గంగాధర్, శ్రీదర్యాదవ్ దేశభక్తి గీతాలను పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, ఏఈ మహేశ్, కౌన్సిలర్లు కృష్టారెడ్డి, సమీయొద్దీన్, వసంత్‌రాజ్, జయరాజ్, కిశోర్, ఆర్కె శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్, ఉమర్, పేర్క కిషన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ
జిల్లాకేంద్రంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆరేళ్ల జనార్దన్‌గౌడ్ ఆధ్వర్యంలో బైక్, ఆటో ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో నాయకులతోపాటు ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో ఫ్రీడమ్ ర్యాలీలు
చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. నార్సింగి ఎం పీపీ సబిత, సర్పంచ్ మహేశ్వరి, ఏపీడీ భీమయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
750 మీటర్ల జాతీయజెండా ప్రదర్శన
పెద్దశంకరంపేట పట్టణం త్రివర్ణ శోభితమైనది. ఎంపీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 750 మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ర్యాలీలో సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఎంపీటీసీలు వీణాసుభాశ్గౌడ్, స్వప్నారాజేశ్వర్, నాయకులు సురేశ్‌గౌడ్, సాయిలు, రవీందర్, పున్నయ్య పాల్గొన్నారు.
రామాయంపేటలో త్రివర్ణ పతాక శోభాయాత్ర
విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ అధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో భారీ జాతీయజెండాతో ర్యాలీ నిర్వ హించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సీఐ.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్, నాయకలు పుట్టి మల్లేశం, ముత్యాలు, సంగమేశ్వర్, మల్లారెడ్డి, రఘుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొల్చారం మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించారు. ప్రతిఒక్కరూ తమ ఇంటిపై జాతీ య జెండాను ప్రదర్శించి జాతీయవాదాన్ని చాటుతున్నారు.