జహీరాబాద్, ఆగస్టు 1 : హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన ‘రియల్’ కాల్పుల ఘటనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు లింకులు ఉన్నట్లు తెలుస్తున్నది. మున్సిపల్ పరిధిలోని రంజోల్ శివారులో 65వ జాతీయ రహదారి పక్కన నగరానికి చెందిన రియల్ వ్యాపారులు వెంచర్ వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలోని ఓ గ్రామనికి చెందిన ప్రజాప్రతినిధి ఒకరు హైదరాబాద్‌లో ఉంటూ రియల్ వ్యాపారం చేస్తున్నాడు. నగరానికి చెందిన ముగ్గురు వ్యాపారులు ఇస్మాయిల్, ముజాహిద్దీన్, జిలానీలకు ఇక్కడ ఐదెకరాల భూమిని ఇప్పించి వెంచర్ చేసి ప్లాట్లు వేయించాడు. వెంచర్ జాతీయ రహదారి పక్కనే ఉండడంతో భారీగగా డిమాండ్ పెరగడంతో వీరి మధ్య డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో మాదాపూర్‌లో ముగ్గురి మధ్య గొడవలో జిలానీ నాటు తుపాకీతో కాల్పులు జరుపడంతో ఇస్మాయిల్‌పై మృతి చెందాడు. ఈ ఘటనలో నియోజకవర్గానికి చెందిన రియల్ వ్యాపారికి సంబంధమున్న వార్త స్థానికంగా చర్చనీయాశంగా మారింది.
హైదరాబాద్‌లో జరిగే ప్రతి ఘటనకు జహీరాబాద్‌తో సంబంధం..?
జహీరాబాద్ ప్రాంతంలో జరిగిన రియల్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవలకు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉండటం చర్చనీయంగా మరింది. జహీరాబాద్ మండలంలోని అనెగుంట శివారులో రియల్ వ్యాపారుల మధ్య భూవివాదం వచ్చి తుపాకీతో కల్పులు జరిగిన సంఘటన ఉంది. కొందరు రియల్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి పేదలకు రైతులకు ఇబ్బందులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. పోలీసు అధికారులు సైతం కొందరు హైదరాబాద్‌కు చెందిన రియల్ వ్యాపారులకు అనుకులంగా వ్యవరించి, పేద రైతులకు ఆన్యాయం చేసిన సంఘటనలు ఉన్నాయి. రియల్ వ్యాపారులు డబ్బులు అధిక మొత్తంలో ఖర్చు చేసి పేద రైతులకు ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. జహీరాబాద్ ప్రాంతంలో అధికంగా హైదరాబాద్‌కు చెంది వ్యాపారులు భూములు కోనుగోలు చేసి రియాల్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి మధ్యవర్తులుగా జహీరాబాద్‌కు చెందిన వారు వ్యవరిస్తున్నారు. భూ సమస్యలు వెలుగులోకి వచ్చిన సమయంలో గొడవలు జరుగుతున్నాయి.
జహీరాబాద్‌లో పెరిగిన రౌడీ షీటర్లు ?
హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్లు జహీరాబాద్ ప్రాంతంలో యువకులతో గ్యాంగులు ఏర్పాటు చేసిన భూ వివాదాలు పరిష్కారం చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. రౌడీ షీటర్లు ఖరీదైన కార్లలో వచ్చి స్థానికంగా ఉన్న రౌడీషీటర్ల గ్యాంగులను పిలించుకొని భూ వివాదాలు ఉన్న భూమికి వచ్చి అక్కడ హల్ చల్ చేసిన సంఘటనలు ఉన్నాయి. నిమ్జ్ ఏర్పాటు కావడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో స్థానికంగా కొందరు యువకులను గ్యాంగులుగా ఏర్పాటు చేసుకొని పేద రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. యువకులకు వింధు భోజనలు ఏర్పాటు చేయడంతో పాటు మద్యం ఇచ్చి దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.
మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు..
రంజోల్ శివారులో ఉన్న వెంచర్ వివాదంతోనే మాదాపూర్‌లో రౌడీషీటర్లు కాల్పులు జరిపారని, ప్రచారం జరుగుతున్నదని సీఐ తోట భూపతిని ప్రశ్నించగా.. తమ పరిధిలో సంఘటన జరగలేదన్నారు. మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారని, రంజోల్ శివారులో వెంచర్ ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. మాదాపూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు.