రామాయంపేట, జూలై 25: పురపాలికలో పన్నులు బకాయిలు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైం స్కీంను ప్రవేశపెట్టింది. ఆస్తిపన్ను చెల్లించని యజమానులకు బకాయిల వసూల్ల కోసం జీవోను జారీ చేసింది. మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి నేటి వరకు పన్నులు కట్టని వారందరికీ ఈ జీవో వర్తిస్తుంది. పన్నులను సకాలంలో చెల్లించని వారికి ఇది ఎంతో ఉపయోగపడ్తుంది. వందశాతం కట్టాల్సిన వడ్డీని కేవలం వన్‌టైం స్కీంలో కేవలం పదిశాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం విడుదల చేసింది. బకాయిలను ఉన్నవారు బకా యి పన్నుతో పాటు పదిశాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంది. 2021-22సంవత్సరం వరకు బకాయి పడ్డ వారు ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని ఏకకాలంలో కేవలం పది శాతం వడ్డీతో పూర్తిగా చెల్లించి వడ్డీపై 90శాతం రాయితీని పొందాలని జీవోలో పేర్కొంది. ఈ అవకాశం అక్టోబర్ 31 2022 వరకు ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్లో ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారికి ప్రభుత్వం 90శాతం వడ్డీ మాఫీని ప్రకటించిదని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, దుకాణాదారులు, ఇండ్లు కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి. కేవలం పదిశాతం వడ్డీతో తమ బకాయిలను వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలి. ఇది కేవలం 31 అక్టోబర్ 2022వరకు మాత్రమే ఉంటుంది.
– మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, ఎంపీడీవో ఉమాదేవి