
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 17: యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జడ్పీ ఉపాధ్యక్షురాలు లా వణ్యరెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం జడ్పీ 3, 5, 6వ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. మూడోస్థాయీ సంఘ సమావేశం(వ్యవసాయం) జడ్పీ వైస్ చైర్పర్సన్ లా వణ్యరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక పో వడంతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆరు తడి పంటలపై దృష్టి సారించాలని సూచించార న్నారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, ను వ్వులు, పొద్దుతిరుగుడు , వేరు శనగ పంటలతో పా టు అధిక లాభాలు వచ్చే కూరగాయలు, జనుము పంటలను సాగుచేయాలని రైతులకు సూచించారు. ఆరు తడి పంటలపై రైతులకు అవగాహన కల్పిచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్నాయక్కు సూచించారు. అంతే కాకుండా అయిల్ ఫామ్ పంటలను సైత ం సా గు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో యాసంగి ఆరుతడి పంటలకు ప్రణాళిక సిద్ధ్దం చేసినట్లు వివరించారు. మార్కెట్ కమిటీల ద్వారా 2020-21 సంవత్సరానికి గాను రూ. 5.61 కోట్లు ఆదాయం, 2021-22 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 2021కి గాను రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్ తెలిపారు. అటవీ శాఖపై ఎఫ్ఆర్వో మనోజ్, ఉద్యానవనంపై జిల్లా అధికారి నర్సయ్య, పౌర సరఫరాలపై ఆ శాఖాధికారి తమ నివేదికలను చదివి వినిపించారు. అనంతరం మధ్యా హ్నం జరిగిన 5వ స్థాయీ సంఘ సమావేశం (స్తీ, శిశు సంక్షే మం కొల్చారం జడ్పీటీసీ అధ్యక్షతన, 6వ స్థాయీ సంఘ సమావేశం(సాంఘిక సంక్షేమం) రామాయంపేట జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగాయి, ఈ సమావేశాల్లో జడ్పీటీసీ లతో పాటు ఆయా జిల్లా అధికారులు జడ్పీ సీఈవో శైలేశ్కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ మాణయ్య పాల్గొన్నారు.