చిలిపిచెడ్, జూన్ 28: సేంద్రియ భూములు పెరగాలంటే పచ్చిరొట్ట వెయ్యాలని సైంటిస్ట్ డాక్టర్ శోభ అన్నా రు. మంగళవారం మండలంలోని వ్యవసాయంపై అవ గాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మా నికి ముఖ్య అతిథిగా సైంటిస్ట్ డాక్టర్ శోభ, సైంటిస్ట్ రా హుల్ విశ్వకర్మ, కృషి విజ్ఞాన కేంద్రం తునికి సైంటిస్ట్ డా క్టర్ రవికుమార్, ఏరువాక కేంద్రం సైంటిస్ట్ సరిత, కౌడిపల్లి ఏడీఏ పద్మ హాజరయ్యారు. అనంతరం చిలిప్చెడ్ (శీలంపల్లి) రైతువేదికలో విత్తనాలు వెదజల్లే పద్ధతి, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, యూరియా దపాలవారిగా వాడటంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సైంటిస్ట్ డాక్టర్ శోభ మాట్లాడుతూ వరి ఎక్కువ వేయడంతో భూసారం కోల్పోవడంతో పచ్చి రొట్టె తప్పనిసరిగా వేయాలన్నారు. సేంద్రియ భూము లు పెరగాలంటే పచ్చిరొట్టె వేయలన్నారు. 900కోట్ల ఖర్చు అయ్యే పచ్చి రొట్టె విత్తనాలు దిగుబడి చేస్తున్నామన్నారు. పచ్చిరొట్టె సీడ్స్ ఉత్పత్తి చేయాలని, జొన్నలు వేసుకోవాలన్నారు. అధిక సాంద్రత పండించే పంట పత్తిపంట అన్నారు. పచ్చిరొట్ట చీర్స్ ఉత్పత్తి చేయాలన్నారు. రాహుల్ విశ్వకర్మ సైంటిస్టు మాట్లాడుతూ అధిక సాంద్రతలో పత్తిసాగు విధానం గురించి రైతులకు వివరించారు. మొక్కకు మొక్కకు 15నుంచి 20సెంటీమీటర్లు గ్యాబుతో విత్తనాలు పెట్టాలన్నారు. అనంతరం డాక్టర్ శోభను కౌడిపల్లి ఏడిఏ పద్మ శాలువాతో సైంటిస్టును సన్మానం చేశారు.
కార్యక్రమంలో సైంటిస్టులు డాక్టర్ శోభ, రాహుల్ విశ్వకర్మ, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ రవికుమార్, ఏరువాక కేంద్రం సంగుపేట్ సైంటిస్ట్ సరిత, కౌడిపల్లి ఏడిఏ పద్మ, ఎంపీపీ వినో ద దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంబర్ స్వామి, చిలిపిచెడ్ సర్పంచ్ లక్ష్మీదుర్గ్గారెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండ ల అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా రైతు సమన్యాయ సభ్యు లు సయ్యద్ హుస్సేన్, సోమక్కపేట్ పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, ఏవో బాల్రెడ్డి, ఏఈవో భూపాల్, కృష్ణవేణి మండలానికి చెందిన రైతులు పాల్గొన్నారు.