హవేళీఘనపూర్/ నిజాంపేట/ రామాయంపేట రూరల్/ మనోహరాబాద్/ మె దక్ రూరల్/ అల్లాదుర్గం, జూన్ 6 : పల్లె ప్రగతి పనులతో గ్రామాలన్ని అభివృద్ధి ప థంలో దూసుకెళ్తున్నాయని మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పల్లెలు పచ్చగా ఉండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని, ఆ దిశగా ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధ్ది పనులు చేపడుతుందని తెలిపారు. హవేళీఘనపూర్ మండలం ఫరీద్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి పనుల ను సక్రమంగా చేపట్టాలని ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామీణ యువత క్రీడా మైదా నాలను వినియోగించుకుని క్రీడారంగంలో రాణించాలని కో రారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌందర్య, మెదక్ సొసైటీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, డైరెక్టర్ సాయిలు, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, ఎంపీడీవో శ్రీరామ్, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, యామిరెడ్డి, సాయాగౌడ్, ఎంపీటీసీ సిద్దిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బ్రహ్మ,ం, శ్రీకాంత్, సాయిలు, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నిజాంపేట మండలంలోని నస్కల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను ఎంపీపీ సిద్ధిరాములు పర్యవేక్షించారు. రామాయంపేట మండలంలో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మురుగునీటి కాలువలు, రోడ్లను శుభ్రం చేయడం, వీధి దీపాలు ఏర్పాటు, మొక్కలు నాటడం చేస్తున్నారు. మనోహరాబాద్ మండలంలోని కొనాయిపల్లి పీటీ, రంగాయిపల్లి, కాళ్లకల్, జీడిపల్లి, మనోహరాబాద్, దండుపల్లి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, వైస్‌ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎం పీటీసీ లత, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, నాగభూషణం, రేఖ, ఉప సర్పంచ్‌లు రేణుకుమార్, రాజూయాదవ్ పాల్గొన్నారు. పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేయొద్దని అల్లాదుర్గం మండ ల ప్రత్యేకాధికారి జయరాం నాయక్ అన్నారు. అప్పాజిపల్లి, ఐబీ తండాలో చేపట్టిన పనులను ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీవో సయ్యద్‌తో కలిసి పర్యవేక్షించారు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో పరిశుభ్రత పెరిగిందని డీఎల్పీవో శంకర్‌నాయక్ అన్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి, రా యున్పల్లిలో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో శ్రీరాములుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పల్లె ప్రగతి ప్రత్యేకాధికారి రాజశేఖర్, ఎంపీవో ప్రశాంత్, సర్పంచ్‌లు సిద్ధాగౌడ్, ప్రభాకర్, కార్యదర్శులు నగేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.