సదాశివపేట, మే 31 : సదాశివపేట పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణంలో ప్రజల అవసరాలు తీర్చేలా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి భారీగా నిధులు మం జూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా సదాశివపేటలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. రూ. 5.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మించనున్నారు. మార్కెట్ నిర్మాణంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, రైతులకు సౌకర్యంగా మారనున్న ది. బుధవారం, ఆదివారం రెండు రోజులు పేటలో అంగడి జరుగు తున్నది. బుధవారం దుర్గమ్మ గుడి వద్దఉన్న బైపాస్‌రోడ్డులో సంత జరుగుతుండడంతో ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం గురునగర్ కాలనీకి వెళ్లే రోడ్డులో సంత జరగనున్నది. దీంతో అక్కడ కూడా ట్రా ఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డు లో రూ.5.50 కోట్లతో అత్యాధునికం గా వెజ్ ఆండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. దీంతో కూరగాయలు, నిత్యావసరాలు, మాంసం అన్ని ఒకే చోట దొరకనున్నాయి. దీంతో కొనుగోలుదారులు, రైతులు, విక్రయదారులకు సౌకర్యంగా ఉంటుంది.
ప్రజలకు సౌకర్యవంతంగా…
సదాశివపేట పట్టణంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం రోడ్లపక్కన కూరగాయల విక్రయాలు, అంగడి జరుగుతుండడంతో ట్రా ఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సదాశివపేట మండలంలోని 31 గ్రామాలతోపాటు కొండాపూర్ మండలంలోని అనంతసాగర్, మారెపల్లి, తొగర్పల్లి, గంగారం, కోనాపూర్, హరిదాస్పూర్, తేర్పో ల్ గ్రామాల ప్రజలు, మోమిన్‌పేట్, మునిపల్లి మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు సదాశివపేట సంతకు వస్తారు. కూరగాయలతోపాటు మటన్, చికెన్, ఎండుమిర్చి, కారంపొడి, పసుపు, నూనె, అల్లం, వెల్లుల్లి, పండ్లు, చేపలు తదితర వాటితో పాటు బట్టలను కొనుగోలు చేస్తారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఒకే దగ్గర కొనగోలు చేయవచ్చు.
ట్రాఫిక్ సమస్యలకు చెక్…
వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. బుధ, ఆదివారం జరిగే సంతకు వందలాది మంది వ స్తుండడంతో వాహనాల పార్కింగ్ లేకపోవడంతో రోడ్డుపైనే ఎక్కడపడితే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మార్కెట్‌కు వచ్చే వారికి తాగునీటి వసతి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో అయితే సమస్యలు చెప్పలేని విధంగా ఉంటాయి. ఆధునిక వెజ్, నాన్ వెజ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య తీరనున్నది.
అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్..
అత్యాధునిక సౌకర్యాలతో పేటలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నాం. మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5.50 కోట్లు మంజూరు చేసింది. నాణ్యతా ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మిస్తు న్నాం. నిర్మాణ పనులు కొనసాగుతున్నా యి. గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాం ట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. నవంబర్‌లోగా మార్కెట్ పనులు పూర్తి చేసి సదాశివపేట పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.
– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్