హవేళీఘనపూర్, మే 5 : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం.. ఏ అవసరాలున్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న మెదక్‌కు వెళ్లాల్సిందే. నిత్యం విద్యార్థులు విద్యాబోధన కోసం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. కొందరు కుటుంబ సభ్యులు అమ్మాయిలను దూరం పంపించలేక మధ్యలోనే చదువు మాన్పించిన పరిస్థితులు ఉండేవి. కానీ, మండల కేంద్రంగా హవేళీఘనపూర్ ఏర్పాటుతో ఈ పరిసర ప్రాంత ప్రజలకు విద్యా సదుపాయం ఎంతో మెరుగుపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే డైట్ కళాశాల( ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం కళాశాల) ఉండగా.. మొదట తెలుగు మీడియంలో చెప్పే వారు. మొదట్లో డైట్ కళాశాలలో 300 విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. కానీ, అనంతరం ఆంగ్ల బోధన, ఉర్దూ మీడియంలో కూడా విద్యాబోధన చేస్తుండడంతో ఒక సంవత్సరంలో 600 మంది విద్యార్థులు ఇక్కడి కళాశాలలో చేరారు. విద్యార్థులు కళాశాలకు వచ్చి, వెళ్లడానికి ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
అనంతరం హవేళీఘనపూర్ మండలంగా ఏర్పడిన తర్వాత మొదటి జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. పా ఠశాలలను కళాశాల స్థాయికి మా ర్పు చేశారు. అనంతరం జ్యోతిబాఫూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను కూడా హవేళీఘనపూర్లోనే ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వ ఉ న్నత పాఠశాల ఉన్నది. బాలబా లికలకు ప్రత్యేక గురుకుల పాఠశా లలు ఉండడంతో తొగిట, చౌట్లపల్లి, సుల్తాన్పూర్, ఔరంగాబాద్ తండా నుంచి విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. గతంలో హవేళీఘనపూర్ నుంచి అధిక శాతం మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ, ఇప్పుడు స్థానికంగానే చదువుతున్నారు. హవేళీఘనపూర్ మండ లకేంద్రం ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతున్నది. గ్రామీఫ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తు న్నది. ప్రతి యేడాది ఇక్కడి పాఠశాలలు, గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో మండలంతోపాటు ఇతర ప్రాంతాల విద్యార్థులు హవేళీఘనపూర్‌లో చదువుతున్నారు.
మండల ఏర్పాటుతోనే అభివృద్ధి
గతంలో హవేళీఘనపూర్‌లో ఎలాంటి కార్యాలయాలు లేక ప్రజలు కూడా పెద్ద గా వచ్చేవారు కాదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభు త్వం నూతన మండలాల ఏర్పాటుతో హవేళీఘనపూర్ మండలంగా ఏర్పడినది. మండల కేంద్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో ప్రా ముఖ్యత పెరిగింది. భవిష్యత్‌తో హవేళీఘనపూర్ మండలం మ రింత అభివృద్ధ్ది చెందుతున్నది.
– శ్రీకాంత్, హవేళీఘనపూర్, మాజీ ఎంపీటీసీ
వ్యాపారాలు కూడా పెరిగాయి
గతంలో హవేళీఘనపూర్ ప్రాంతం లోని వ్యాపారాలకు అంత పెద్దగా గిరాకీలు ఉండేవి కాదు. మండలంగా ఏర్పా టు చేయడంతోపాటు అనేక విద్యా సం స్థలను నూతనంగా ప్రారంభించారు. దీంతో హవేళీఘనపూర్ మండల కేం ద్రంలో వ్యాపారాలు విస్తరించారు. ఫలితంగా అందరికీ ఉ పాధి అవకాశాలు పెరిగాయి. మా తండా నుంచి విద్యార్థులు హవేళీఘనపూర్కు వచ్చి చదువుత్తున్నారు.
– శ్రీనునాయక్, స్థానిక వ్యాపారి