రామచంద్రాపురం, మే01: సమాజంలోని కుల, మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889వ జయంతిని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీ రంగూడ నుంచి జహీరాబాద్ వరకు నిర్వహించిన వాహన ర్యాలీని ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు, బసవ భవన నిర్మాణానికి ఎకరా స్థలం, రూ.5కోట్లు నిధులను రాష్ట్ర ప్రభు త్వం కేటాయించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్పానగేశ్, మెట్టుకుమార్‌యాదవ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, క్రాంతి పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని సన్నాహక కారు ర్యాలీని బీరంగూడ నుంచి జహీరాబాద్ వరకు నిర్వహించారు. కంది మండల కేంద్రంలోని శివాలయంలో విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సర్పంచ్ విమల వీరేశంతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సిద్దేశ్వర్, మధుశేఖర్, చంద్రశేఖర్, చంద్రకాంత్, అన్మిశెట్టి జయప్రకాశ్, శివరాజ్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ రామప్ప, నాయకులు పాల్గొన్నారు.
సిర్గాపూర్‌లో..
విశ్వ గురువు బసవేశ్వరుడి అడుగు జాడల్లో నడవాలని బిచ్కుంద పీఠాధిపతి సోమాయప్ప, కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్ తెలిపారు. ఆదివారం కడ్పల్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించి, క్షీరాభిషేకం, పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, జడ్పీటీసీ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ యువనేత రోశన్రెడ్డి, తెలంగాణ జాగృతి యువ విభాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్‌రాజ్, సర్పంచ్, వీర శైవ లింగాయత్, జంగమ సమాజ్ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఘనంగా బసవ జయంతి
బసవేశ్వరుడి అడుగుజాడల్లో పయనించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నా రు. ఆదివారం బసవ జయంతిని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అందరూ కలిసి మెలి సి జీవించాలని బసవేశ్వరుడు హితోపదేశం చేశాడన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పాల్గొన్నారు.