సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తేనే విజయం తథ్యమని, నిరాశ, నిరుత్సా హం వీడి చదివితే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటా రని పోలీస్ శిక్షణా అభ్యర్థులకు ఎస్పీ రమణకుమార్ సూచించారు. పోలీస్ నియామకాలకు సంబంధించి సంగారెడ్డి అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రమణకుమార్ అభ్యర్థులతో మాట్లాడి సలహాలు, సూచనలు చేశారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కేంద్రం లో చెప్పే అంశాలను శ్రద్ధగా వినాలని, ఒక్క రోజు కూ డా గైర్హాజరు కావద్దన్నారు. వరుసగా 3 రోజుల పాటు శిక్షణకు రాకుంటే శిక్షణా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
శిక్షణ కేవలం పోలీస్ ఉద్యోగాలకే కాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లో సంగారెడ్డి జిల్లాకే అత్యధికంగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయం సాధిస్తారన్నారు. పూర్తి పారదర్శకంగా మెరిట్ ప్రకారమే పోలీస్ సెలక్షన్ జరుగుతాయన్నారు. ప్రైవేట్ కో చింగ్ సెంటర్లకు దీటుగా ఇక్కడ శిక్షణ ఉంటుందన్నా రు. ఉద్యోగం వస్తే మీకు మీ కుటుంబానికి, సమా జం లో గౌరవం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిణతో చదివి ఉద్యోగం సాధించాలని సూ చించారు. సోషల్ మీడియా, సినిమాలు, షికార్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు, డీటీసీ డీఎస్పీ ప్రభాకర్, సీఐలు రమేశ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.