మెదక్, ఏప్రిల్ 25: ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖాధికారి కేశూరాం సూచించారు. సోమవారం కలెక్టరేట్లో గిరిజన శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్, ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్ల ఉచిత శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శారీరకదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించి యువతీ, యువకులకు ఆయా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదించాలని ఆకాంక్షించారు. జిల్లాలో పోలీసు ఉ ద్యోగాలకు మెదక్, నర్సాపూ ర్, రామాయంపేటలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి ఇందిర, మెదక్ సీఐ మధు, ఎస్సై రాజశేఖర్, వసతి గృహ సంక్షేమ అధికారులు యాద య్య, సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.