మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21: యాసంగి ధాన్యం కొనుగోలులో వ్యవసాయాధికారులు పూర్తిగా నిమగ్నమై పనిచేయాల్సిన అవశ్యకత ఉందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు చాలా సునిశితమైనదని, గన్ని సంచుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యా సంగి ధాన్యం కొనుగోలులో స్తబ్ధత వలన రైతులు వరినాట్లు కాస్త ఆలస్యంగా వేసినందున పంట సైతం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లోని రైతులు ఒకేసారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఇబ్బందులు పడకుండా మానిటరింగ్ చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల నుంచి ఒక కేంద్రంలో రోజు 500 నుంచి 600క్వింటాళ్ల ధాన్యం వచ్చేలా ప్రణాళిక రూ పొందించుకుని టోకెన్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పంట ఎంత వేశారు, ధాన్యం ఎంత వస్తుందన్న సమాచారం అందిస్తున్నామని, దాని ప్రకారమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదా లేదా అనే విషయాన్ని పరిశీలిసంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ బయటి నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలన్నారు. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించాలని సూచించారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్లు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధంగా ఉంచడంతో పాటు తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించాలన్నారు. తూకం లో ఎలాంటి తేడా రాకుండా చూడాలని, రైస్ మిల్లులో లేదా క్షేత్రంలో ఉండేలా మానిటరింగ్ చేయాలని జిల్లా రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్‌కు సూచించారు. రా రైస్ తీసుకోవడానికి జిల్లాల 150 రైస్ మిల్లులు అందుబాటు లో ఉన్నందున సాఫీగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, పౌరసరఫరాల శాఖ డీఎం సాయిరామ్, డీఎస్వో శ్రీనివాస్, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆశకుమారి, వ్యవసాయధికారులు పాల్గొన్నారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సహకార శాఖ ఆధ్వర్యం లో ధాన్యం కొనుగోలుపై ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సహకారశాఖ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో అదనపు కలెక్టర్ రమేశ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంత ధాన్యం వచ్చినా అందరి సహకారంతో అధిగమించామని, కానీ ఈసారి గన్ని సంచుల కొరత ఉందని, కొత్త సంచులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి రైతులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ఇతర కొనుగోలు కేంద్రాలకు ఇబ్బంది కలుగకుండా అవసరం మేరకే గన్నీ బ్యాగుల కోసం ఇండెంట్ పెట్టాలని సూచించారు. ఈ యాసంగిలో 3.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున గత యాసంగి మాదిరే ప్యాక్స్, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
40రోజుల పాటు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నా రు. రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి కేంద్రాలకు తేవాలని సూ చించారు. ధాన్యం తూకంలో వ్యత్యాసం అనే అపవాదం రాకుండా చూడాలన్నారు. విజిలెన్స్ అధికారులు ఏ కేంద్రాలనైనా ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరా జిల్లా మేనేజర్ సాయిరాం, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, పీఏసీఎస్ చైర్మ న్లు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.